Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:45 AM

పద్మశాలి కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించాలి

10-03-2026 471 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యను నివారించేందుకు పద్మశాలి కాలనీలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నిర్వహించిన ఇంటింటా సిపిఎం కార్యక్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు మాట్లాడుతూ… కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని కోరారు. అలాగే జియో ట్యాగ్‌తో సంబంధం లేకుండా చేనేత కార్మికులకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని, రూ.40 కోట్ల నిధులు కేటాయించి ఆసుపత్రి పక్కన కొత్త భవనాలు నిర్మించి వైద్య సేవలను మెరుగుపరచాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 16న నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా దీక్షకు మద్దతు తెలుపుతూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లెనిన్, మండల కమిటీ సభ్యులు భావడ్లపెల్లి బాలరాజు, గోరిగే సోములు, కార్మిక సంఘ నాయకులు పల్లె సత్యం, సబ్ శాఖ కార్యదర్శి గంజి అశోక్, కడారి రాములు, అప్పం సంతోష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పద్మశాలి కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News