Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:35 AM

ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి

04-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్/:

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి పురోగతి సాధించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల మ్యాపింగ్, బూత్ స్థాయి అధికారుల శిక్షణ, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై చర్చించారు.

మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బూత్ స్థాయి అధికారులు సమర్థంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం పూర్తి చేయాలని తెలిపారు.

బూత్ స్థాయి అధికారులకు శిక్షణ అందించడంతో పాటు ఏజెంట్లకు, రాజకీయ పార్టీలకు అవసరమైన శిక్షణ మెటీరియల్ అందజేయాలని సూచించారు. బూత్ స్థాయిలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: సీఈఓ సుదర్శన్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News