Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:36 AM

నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి

నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి

నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి
10-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఉన్న నోష్ ల్యాబ్ ఫార్మా కంపెనీ కార్మికులకు భద్రత కల్పించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఆ సంస్థపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారి ఎం. మోతిలాల్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ, కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి లాభాల కోసం కంపెనీ నిర్వహణ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడంతో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని, కార్మికులు తీవ్రంగా గాయపడుతున్నారని అన్నారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ, యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రమాదాల సమయంలో మాత్రమే అధికారులు స్పందించి, తరువాత నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోయి, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అందువల్ల వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, నోష్ ల్యాబ్ ఫార్మా కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ఎన్. నాగయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నోష్ ల్యాబ్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News