Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:40 AM

నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్‌ల సన్మానం

11-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో శోభనాద్రిపురం సర్పంచ్ కంచి మధుసూదన్‌ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, మాజీ డి.ఈ బొడ్డు సురేందర్‌లను కూడా ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, నియోజకవర్గం ఏర్పాటు ప్రతి ఒక్కరికీ అవసరమని, అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, యువత, విద్యావేత్తలు కలిసి ఉద్యమించి నియోజకవర్గ సాధనకు ముందుకు రావాలని కోరారు.

డీలిమిటేషన్ కమిటీ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు, మంత్రులను కలిసి నియోజకవర్గం ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. మండలంలోని అన్ని వర్గాలు ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సాధన సమితి కార్యదర్శి గడ్డం యాదగిరి, సహాయ కార్యదర్శి ఎండి ఫజల్, సలహాదారులు గంగాపురం యాదయ్య, ఉపాధ్యక్షులు కూనూరు కృష్ణ, బొడ్డు శంకరయ్య, రచ్చ యాదగిరి, ఎండి ఇమామ్ సాహెబ్, గంగాపురం వెంకటయ్య, దండుగుల రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్‌ల సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News