Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

నియోజకవర్గ హక్కు కోసం రామన్నపేటలో ఐక్యతే బలం. ముక్కామల దుర్గయ్య

04-04-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ సాధన కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని మాజీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, తెలంగాణ వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముక్కామల దుర్గయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలం మరియు పరిసర ప్రాంత ప్రజలు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. నియోజకవర్గ సాధన కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, దేశ స్థాయి వరకు సమన్వయంతో పోరాటం చేపట్టాలని పేర్కొన్నారు.

జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి అధికారులను కలిసి రామన్నపేట ప్రాంత భౌగోళిక పరిస్థితులు, చారిత్రక ప్రాధాన్యతను వివరించి, ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని చాటాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలని తెలిపారు.

రామన్నపేట నియోజకవర్గం ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధికి వేగం చేకూరుతుందని, ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని అన్నారు. అందుకే అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుందని దుర్గయ్య యాదవ్ స్పష్టం చేశారు.

Sthanikam

నియోజకవర్గ హక్కు కోసం రామన్నపేటలో ఐక్యతే బలం. ముక్కామల దుర్గయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News