Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:23 AM

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు – కలెక్టర్ హనుమంతరావు

24-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పరిశ్రమల్లో భద్రతా లోపాలపై గట్టి హెచ్చరిక

జిల్లాలోని పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు, పేలుళ్లు వంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. నిర్లక్ష్యం ప్రాణనష్టాలకు దారితీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణలతో కలిసి పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు, పేలుళ్ల నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రమాదకర కర్మాగారాలపై ప్రత్యేక నిఘా

జిల్లాలోని రసాయన, బల్క్ డ్రగ్స్ మరియు ప్రమాదకర కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు కావాలని కలెక్టర్ ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్మికుల ప్రాణ భద్రతే ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.

స్టీమ్‌కు ఆటో కట్–ఆఫ్ సిస్టమ్, రియాక్టర్లకు సేఫ్టీ వాల్వులు, రప్చర్ డిస్కులు వంటి కీలక భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. లోపాలు గుర్తిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ప్రమాదం జరిగితే తక్షణ చర్యలు

జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రమాదం సంభవించినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసి, విషవాయువుల ప్రభావం నివాస ప్రాంతాలపై పడకుండా వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు ముందస్తు ప్రణాళిక సిద్ధంగా ఉండాలన్నారు.

రెండు కర్మాగారాలకు నిషేధ ఉత్తర్వులు

తీవ్ర భద్రతా లోపాలు, చట్ట ఉల్లంఘనలు గుర్తించిన నేపథ్యంలో బృందవాన్ లబోరా్టోరీస్ , వి .జె . సాయి కెమికల్స్క కార్మాగారాలకు నిషేధ ఉత్తర్వులు జారీ చేసి, ప్రాసిక్యూషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి వెల్లడించారు.

సమావేశంలో డీఐసీ రవీందర్, జిల్లా ఫైర్ అధికారి సందేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు – కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News