Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

25-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల

ఎండాకాలంలో నీటిని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రజలను కోరారు. గృహాల వద్ద మురుగు నీరు నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.

గ్రామంలోని బోటిమీదగూడెంలో వార్డు సభ్యుడు మేకల జలందర్‌తో కలిసి ఇంటింటికి తిరిగి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి కొరత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేస్తూ వినియోగించాలని, అందరికీ సరిపడేలా సహకరించాలని కోరారు.

ఇళ్ల ముందు మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని అవగాహన కల్పించారు.

గ్రామపంచాయతీ అనుమతి లేకుండా కొత్త గృహ నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామపంచాయతీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు మేకల జలందర్, గ్రామపంచాయతీ సిబ్బంది బూడిద మారయ్య, బూడిద ముత్తయ్య, శిరీషాల స్వామి, కొమిరే తిరుమలేష్, శిరీషాల సుధీర్, శిరీషాల గణేష్, జంగం యాదయ్య, శిరీషాల సురేష్, మిర్యాల రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీటిని వృథా చేయొద్దు: సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News