Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

నేలపట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నేలపట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

నేలపట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: సంఘం అధ్యక్షులు బూడిద లింగస్వామి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని బాబాసాహెబ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా నేలపట్ల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూడిద లింగస్వామి, గౌరవ అధ్యక్షులు బూడిద ఎట్టయ్య మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన ఆయన బాటలో యువత నడవాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో 7వ వార్డు సభ్యులు కత్తుల సాయికుమార్, సంఘం కార్యదర్శి ఎనమల్ల సుదర్శన్, మధు కుమార్, నాగరాజు, కిరణ్, శివ, శ్యామ్, కార్తీక్, యశ్వంత్, విహాన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేలపట్లలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News