న్యాల్కల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.గ్రామ అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై సమావేశంలో చర్చించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను ప్రజలు ప్రస్తావించారు.ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను అధికారులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ప్రబులు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి-ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ సరోజ ఆంజనేయులు, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
PRINT TIME: October 11, 2026 08:19 AM
న్యాల్కల్‌లో గ్రామసభ.. సమస్యల వెల్లువ
న్యాల్కల్‌లో గ్రామసభ.. సమస్యల వెల్లువ
02-04-2026
58 Views
స్థానికం ప్రతినిధి :
Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.గ్రామ అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై సమావేశంలో చర్చించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను ప్రజలు ప్రస్తావించారు.ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను అధికారులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ప్రబులు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి-ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ సరోజ ఆంజనేయులు, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి