Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

న్యాల్కల్ బస్టాండ్‌లో భారత్ గ్యాస్ వాహనం నిలిపివేత.. వినియోగదారుల ఆగ్రహం

14-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో భారత్ గ్యాస్ (స్వరాజ్) సరఫరాపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ ఇంటికి రాకపోయినా డెలివరీ అయినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారని పలువురు వినియోగదారులు ఆరోపించారు. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికులు గ్యాస్ సరఫరా వాహనాన్ని బస్టాండ్ ప్రాంగణంలో రెండు నుంచి మూడు గంటల పాటు నిలిపివేశారు.

ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన అద్నూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వినియోగదారులతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పారు. గ్యాస్ సరఫరా వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం గ్యాస్ సరఫరా వాహనం యథావిధిగా పంపిణీ కొనసాగించగా వినియోగదారులు సిలిండర్లను స్వీకరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

న్యాల్కల్ బస్టాండ్‌లో భారత్ గ్యాస్ వాహనం నిలిపివేత.. వినియోగదారుల ఆగ్రహం

Article Image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో భారత్ గ్యాస్ (స్వరాజ్) సరఫరాపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ ఇంటికి రాకపోయినా డెలివరీ అయినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారని పలువురు వినియోగదారులు ఆరోపించారు. ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానికులు గ్యాస్ సరఫరా వాహనాన్ని బస్టాండ్ ప్రాంగణంలో రెండు నుంచి మూడు గంటల పాటు నిలిపివేశారు.

ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన అద్నూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వినియోగదారులతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పారు. గ్యాస్ సరఫరా వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం గ్యాస్ సరఫరా వాహనం యథావిధిగా పంపిణీ కొనసాగించగా వినియోగదారులు సిలిండర్లను స్వీకరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News