Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:40 AM

నాటు సారాయి నేరాలపై చింతలపూడి ఎక్సైజ్ అధికారుల ఉక్కుపాదం – పలు గ్రామాల్లో సంయుక్త దాడులు

15-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది సంయుక్తంగా నాటు సారాయి నేరాల నివారణ కోసం పలు గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాగిరెడ్డిగూడెం, పంతంగలగూడెం, రేచర్ల, తిమ్మిరెడ్డిపల్లి, ప్రగడవరం గ్రామాలలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన నవోదయం 2.0 లో భాగంగా గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించి నాటు సారాయి తయారీ, విక్రయం చట్ట విరుద్ధమని వివరించారు. నాటు సారాయి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇదే సమయంలో లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఒక మహిళ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 180 మిల్లీలీటర్ల పరిమాణం గల 10 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అదనంగా లింగపాలెం మండల పరిధిలోని పలు మద్యం దుకాణాలలో కూడా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటిస్తున్నారో లేదో పరిశీలించారు. ఈ దాడుల్లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్‌.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ తెలిపారు.

Sthanikam

నాటు సారాయి నేరాలపై చింతలపూడి ఎక్సైజ్ అధికారుల ఉక్కుపాదం – పలు గ్రామాల్లో సంయుక్త దాడులు

Article Image

ఏలూరు జిల్లా చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది సంయుక్తంగా నాటు సారాయి నేరాల నివారణ కోసం పలు గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాగిరెడ్డిగూడెం, పంతంగలగూడెం, రేచర్ల, తిమ్మిరెడ్డిపల్లి, ప్రగడవరం గ్రామాలలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన నవోదయం 2.0 లో భాగంగా గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించి నాటు సారాయి తయారీ, విక్రయం చట్ట విరుద్ధమని వివరించారు. నాటు సారాయి వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇదే సమయంలో లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఒక మహిళ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 180 మిల్లీలీటర్ల పరిమాణం గల 10 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అదనంగా లింగపాలెం మండల పరిధిలోని పలు మద్యం దుకాణాలలో కూడా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటిస్తున్నారో లేదో పరిశీలించారు. ఈ దాడుల్లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్‌.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News