Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

‘నారీ శక్తి వందన్‌’కు మద్దతు.. సంతకాల సేకరణ

17-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: మహిళా సాధికారతకు దోహదపడే ‘నారీ శక్తి వందన్ అధినియం’కు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. పట్టణంలోని పలు కళాశాలల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థినుల నుంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, నారీ శక్తి వందన్ అధినియం భువనగిరి పార్లమెంట్ కో-కన్వీనర్ పట్నం కపిల్ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. మహిళల భాగస్వామ్యం పెరిగితేనే దేశ అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఈ చట్టానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కౌన్సిలర్లు వంగేటి సుచరిత, బండారు స్వర్ణలత చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, నాయకులు ఇండ్ల సత్యవతి, ఎంజాల మల్లిక, లక్ష్మి, పావని, లత, ఉషాకిరణ్, భరత్, శివలింగం, ప్రసన్న, నిర్మలతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

‘నారీ శక్తి వందన్‌’కు మద్దతు.. సంతకాల సేకరణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News