Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో బరిలో 57 మంది అభ్యర్థులు

03-02-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల సహాయ అధికారి జే. జేగ్జీవన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, రెండవ సాధారణ మునిసిపల్ ఎన్నికలలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం 118 మంది అభ్యర్థుల నుండి 153 నామినేషన్లు స్వీకరించబడినట్లు వెల్లడించారు.నిర్దేశిత గడువు ముగిసేలోగా 61 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారని తెలిపారు. తద్వారా ప్రస్తుతం నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరిగే ఎన్నికల్లో 57 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని వివరించారు.ఈ 57 మంది అభ్యర్థులలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు 50 మంది కాగా, మిగిలిన 7 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారని చెప్పారు. రాజకీయ పార్టీ వారీగా అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

జాతీయ కాంగ్రెస్ పార్టీ – 15 మంది

భారతీయ జనతా పార్టీ – 15 మంది

భారత రాష్ట్ర సమితి – 15 మంది

ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇటెహాద్ ఉల్ ముస్లిమీన్ పార్టీ – 3 మంది

బహుజన్ సమాజ్ పార్టీ – 1 వ్యక్తి

భారత కమ్యూనిస్టు పార్టీ – 1 వ్యక్తి

స్వతంత్ర అభ్యర్థులు – 7 మంది

మొత్తం అభ్యర్థులు – 57 మంది

నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సహాయ అధికారి జే. జేగ్జీవన్ తెలిపారు.

Sthanikam

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో బరిలో 57 మంది అభ్యర్థులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News