Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

నాలుగు మండలాలకు పీఎన్‌జీ గ్యాస్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్

08-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, వలిగొండ మండలాలకు పైప్‌లైన్ ద్వారా గృహ వినియోగదారులకు పీఎన్‌జీ (Piped Natural Gas) గ్యాస్ సరఫరా అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

బుధవారం మినీ మీటింగ్ హాల్‌లో జిల్లారెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, అడిషనల్ ఎస్పీ లక్ష్మినారాయణతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎన్‌జీ అమలు పురోగతిని పరిశీలించారు.

జిల్లాలో నాలుగు మండలాల్లో గ్యాస్ పైప్‌లైన్ ద్వారా గృహాలకు సురక్షితంగా, నిరంతర సరఫరా అందించేందుకు చేపడుతున్న పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పైప్‌లైన్ పనులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

రెవెన్యూ, మున్సిపల్, గ్రామపంచాయతీ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పనుల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్ల తవ్వకాలు, డ్రైనేజీ, మరమ్మత్తుల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

అలాగే భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులు నిర్వహించాలని, పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, సిటీ గ్యాస్ ప్రతినిధులు రమేష్, వంశీ, జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, తహసీల్దార్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

నాలుగు మండలాలకు పీఎన్‌జీ గ్యాస్ సరఫరా వేగవంతం చేయాలి: కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News