Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసనకు పిలుపు.TGEJAC

16-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, :

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (TGEJAC) పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం (ఏప్రిల్ 17) మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో భోజన విరామ సమయంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించారు. జేఏసీ జిల్లా చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ భగత్ సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, 2023 నుంచి అమలు కావాల్సిన రెండో పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రూ.13 వేల కోట్ల బిల్లులను విడుదల చేయాలని, ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ (EHS) సౌకర్యాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. కొత్త పెన్షన్ విధానం (CPS) రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 17న భోజన విరామ సమయంలో నిర్వహించే ధర్నాలో మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు పాల్గొనాలని సమావేశంలో తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భగత్, పీఆర్‌టీయూ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు యాదయ్య, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, ట్రెస్సా అధ్యక్షుడు కృష్ణ, టీఎన్జీవో నాయకులు శ్రీకాంత్, శశికాంత్, డీటీఎఫ్ నాయకులు లక్ష్మీనరసింహ, శైలజ, లింగయ్య, దుర్గాప్రసాద్, యూఐఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసనకు పిలుపు.TGEJAC

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News