Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రోన్‌తో జెండా ఎగరవేసిన జెట్టి శివప్రసాద్ వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 09:51 PM

నల్గొండలో ఘనంగా బాబాసాహెబ్‌ 135వ జయంతి వేడుకలు..

నల్గొండలో ఘనంగా బాబాసాహెబ్‌ 135వ జయంతి వేడుకలు..

నల్గొండలో ఘనంగా బాబాసాహెబ్‌ 135వ జయంతి వేడుకలు..
April 14, 2026 05:41 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

అంబేడ్కర్‌ రాజ్యాంగంతోనే చిన్న రాష్ట్రాల అభివృద్ధి..

నల్గొండలో ఘనంగా బాబాసాహెబ్‌ జయంతి వేడుకలు,హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

డీఈఓ కార్యాలయ చౌరస్తా ఇకపై ‘అంబేడ్కర్‌ సర్కిల్‌’..

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట..


నల్గొండ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే చిన్న రాష్ట్రాల ఏర్పాటు, తద్వారా అభివృద్ధి సాధ్యమైందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి ప్రపంచ వ్యాప్తంగా దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని కొనియాడారు. అనంతరం డీఈఓ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చదువు విలువను చాటిచెప్పిన అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగానే బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడంతో పాటు, ఇంటర్ జూనియర్ కళాశాలలు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వంటి సంస్థలను బలోపేతం చేశామని గుర్తు చేశారు. భవిష్యత్తులో అన్ని కులమతాల వారికి నాణ్యమైన విద్యనందించేందుకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్’ పాఠశాలలను అందుబాటులోకి తెస్తున్నామని నియోజకవర్గానికి ఒక తెలంగాణ మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

పట్టణ సుందరీకరణలో భాగంగా డీఈఓ కార్యాలయ చౌరస్తాను అభివృద్ధి పరిచి దానికి ‘అంబేడ్కర్ సర్కిల్’గా నామకరణం చేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రభుత్వం కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తోందని అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ తదితరులు ప్రసంగించారు. వేదికపై ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, వై.అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, వివిధ దళిత సంఘాల నాయకులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News