Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:44 AM

నకిలీ పత్రాలతో భూమి మోసం – ఏడుగురు అరెస్ట్**

12-03-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

రంగారెడ్డి జిల్లా : పత్రాలు సృష్టించి భూమిని విక్రయించినట్లు చూపిస్తూ మోసానికి పాల్పడిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 395/2026 కింద కేసు నమోదు చేశారు. నిందితులు వల్లాల ప్రేమ్ కుమార్, కొటియా నాగేంద్ర ప్రసాద్, యెల్మటి సుకుమార్ రెడ్డి కలిసి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వంటి పత్రాలను నకిలీగా తయారు చేశారు. మహిళల పేర్లతో తప్పుడు వ్యక్తులను చూపిస్తూ పత్రాలు సిద్ధం చేసి,వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్ 645/1987 పేరుతో నకిలీ సేల్ డీడ్ రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నకిలీ పత్రాల ఆధారంగా అబ్దుల్లాపుర్‌మెట్ మండలం మునగనూరు గ్రామంలోని సర్వే నంబర్లు 60, 74, 75, 76లలో ఉన్న 400 చదరపు గజాల ఓపెన్ ప్లాట్‌ను గారిమెల్ల కామేశ్వర్‌రావుకు విక్రయించినట్లు చూపిస్తూ మోసం చేసినట్లు వెల్లడించారు. ఈ మోసానికి ఇతర నిందితులు కూడా సహకరించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఐదు స్మార్ట్ మొబైల్ ఫోన్లు, ఒక డెల్ ల్యాప్‌టాప్, నకిలీ సేల్ డీడ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తు డీసీపీ డా. బి. అనురాధ పర్యవేక్షణలో అదనపు డిప్యూటీ కమిషనర్ కోటేశ్వర్‌రావు, వనస్థలిపురం ఏసీపీ పి.కాశిరెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ మహేష్, ఎస్సై డి.నాగరాజు బృందం నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Sthanikam

నకిలీ పత్రాలతో భూమి మోసం – ఏడుగురు అరెస్ట్**

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News