Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 12:42 AM

నిబంధనలు పాటించండి బహుమతులు గెలుచుకొండి.!

18-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

వాహనదారులకు 'జీరో ఎన్ఫోర్స్‌మెంట్'తో పోలీసుల అవగాహన..

నిబంధనలు పాటించిన వారికి డీఎస్పీ చేతుల మీదుగా బహుమతులు..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వినూత్న కార్యక్రమం..

నల్లగొండ : ట్రాఫిక్ నిబంధనలంటే కేవలం జరిమానాలు మాత్రమే కాదని, అవి ప్రాణ రక్షణ కవచాలని నల్లగొండ పోలీసులు వాహనదారులకు వినూత్న రీతిలో వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజు వేడుకల్లో భాగంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మార్గదర్శకత్వంలో శనివారం పట్టణంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు "జీరో ఎన్ఫోర్స్‌మెంట్" విధానాన్ని అవలంబించారు. సాధారణంగా తనిఖీలు అంటే జరిమానాల భయం ఉండే వాహనదారులకు ఈసారి పోలీసులు కేవలం అవగాహన కల్పించడం ద్వారా ఆశ్చర్యపరిచారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని వాహన పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ట్రాఫిక్ నియమాలను నిబద్ధతతో పాటిస్తున్న వారిని పోలీసులు ప్రోత్సహించడం. రహదారిపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించిన వాహనదారులను గుర్తించి వారిని ఆపి మరీ సత్కరించారు. వేద డాన్స్ అకాడమీ సహకారంతో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి చేతుల మీదుగా క్రమశిక్షణ గల వాహనదారులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ వినూత్న ప్రయోగం వాహనదారుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కేవలం చలాన్ల ద్వారా భయపెట్టడం కంటే ఇలా గౌరవించి బహుమతులు ఇవ్వడం వల్ల ప్రజల్లో బాధ్యత పెరుగుతుందని డీఎస్పీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

నిబంధనలు పాటించండి బహుమతులు గెలుచుకొండి.!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News