Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

నాగిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి చౌరస్తాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లో జన్మించి భారత రాజ్యాంగ రూపకర్తగా, ప్రముఖ సామాజిక సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా సేవలందించిన మహనీయుడని పేర్కొన్నారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించారని తెలిపారు.

స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి, రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించిన అంబేద్కర్ గారికి మరణానంతరం 1990లో భారతరత్న పురస్కారం లభించిందని గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న ఆయన జయంతిని అధికారికంగా జరుపుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి.పి కేశవపట్నం రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు చుక్క పద్మయ్య, ఉప సర్పంచ్ క్యాసాని శేఖర్ యాదవ్, వార్డు సభ్యులు చింతల దేవేందర్ గౌడ్, ఎలిమినేటి సురేష్ రెడ్డి, జిట్టా మౌనిక ప్రశాంత్ రెడ్డి, గుండు ఉమారాణి, మాజీ వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

నాగిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News