Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:49 AM

నాగార్జున స్కూల్‌లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

10-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్‌లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచించారు.

పెట్రోల్ పంపుల్లో మంటలు చెలరేగినప్పుడు నీటితో కాకుండా ఇసుక, కార్బన్ డై ఆక్సైడ్, ఫోమ్ వంటి పదార్థాలతో మంటలను అదుపులోకి తీసుకురావాలని వివరించారు. భవనాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెలువడే దట్టమైన పొగ వల్ల ఆక్సిజన్ అందక ప్రాణాపాయం కలగవచ్చని తెలిపారు.

అలాంటి పరిస్థితుల్లో చేతి రుమాలను ముఖానికి కట్టుకుని నేలపై ప్రాకుతూ బయటకు రావాలని సూచించారు. అలాగే ఫైర్ ఇంజన్‌లో వాటర్ ఫిల్లింగ్ విధానం మరియు ఇతర అగ్నిమాపక పరికరాల వినియోగాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ నాగరాజు ఎన్., ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మధుసూధన్ రెడ్డి, లీడింగ్ ఫైర్ ఫైటర్ ఆర్. భీకు, డ్రైవర్ కాశీరాం, ఫైర్ ఫైటర్స్ జే. వెంకటేశ్వర్లు, సిచ్. మధు మరియు పాఠశాల బోధన సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

నాగార్జున స్కూల్‌లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News