Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

నాగరాజు మాదిగకు దళిత రత్న పురస్కారం......

Updated : 16 Apr 2026 04:58 IST
As Preferred Source 1 min read
నాగరాజు మాదిగకు దళిత రత్న పురస్కారం......

ఎస్సీ వర్గీకరణ మలిదశ ఉద్యమకారుడు, కోదాడ పట్టణానికి చెందిన బచ్చలకూరి నాగరాజు మాదిగకు రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డుతో గౌరవించింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సమక్షంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఉత్సవాల కమిటీ చైర్మన్ గంటా సుదర్శన్ చేతుల మీదుగా నాగరాజు ఈ అవార్డును అందుకున్నారు. జాతి ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో భాగస్వామినై జాతి కోసం కృషి చేస్తున్నానని, ఈ అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. తనకు సహకరించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు......

Sthanikam

నాగరాజు మాదిగకు దళిత రత్న పురస్కారం......

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news