Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం సభను విజయవంతం చేయాలి నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 11:09 AM

నేటి నుంచే జనగణన స్వీయ నమోదు..

నేటి నుంచే జనగణన స్వీయ నమోదు..

నేటి నుంచే జనగణన స్వీయ నమోదు..
25-04-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

మే 10 వరకు పోర్టల్‌లో వివరాల వెల్లడికి అవకాశం..

తొలిసారిగా కుల వివరాల సేకరణ అంతా డిజిటల్ మయం.. కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ : దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘జనగణన-2027’ ప్రక్రియలో భాగంగా ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వీయ గణన’ (Self Enumeration) విధానాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన ప్రక్రియ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రజలు తమ వివరాలను అధికారిక వెబ్ పోర్టల్ se.census.gov.in ద్వారా స్వయంగా నమోదు చేసుకోవాలని, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించారు.

నమోదు పూర్తయ్యాక మొబైల్ లేదా ఇమెయిల్‌కు వచ్చే ‘ఎస్.ఈ. ఐడీ’ని భద్రపరుచుకోవాలని తదుపరి దశలో ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని చూపిస్తే నమోదు ధృవీకరణ పూర్తవుతుందని వివరించారు. జనగణనను ప్రభుత్వం రెండు దశల్లో నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు. మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి విడతలో ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన ఉంటుందని, 2027 ఫిబ్రవరి 9 నుండి 28 వరకు తుది జనగణన ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తున్న ఈ జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చేపట్టడమే కాకుండా ఈసారి ప్రత్యేకంగా కులం వివరాలను కూడా నమోదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 5,03,000 గృహాలు ఉండగా, వాటి గణన కోసం 3,729 హౌసింగ్ బ్లాక్ లు, 479 సర్కిళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం 3,179 మంది గణకులు, 531 మంది సూపర్వైజర్లు, 41 మంది చార్జి అధికారులను నియమించినట్లు వెల్లడించారు.​ జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల శిక్షణ పూర్తి చేశామని ఈ నెల 27 నుంచి మూడో విడత శిక్షణ ఇస్తామని కలెక్టర్ వివరించారు. స్వీయ గణనపై విస్తృత ప్రచారం కల్పించాలని ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు ఎంతో కీలకంగా మారుతాయని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సి.పి.ఓ. శ్రీనివాస్ నాయక్, డి.పి.ఆర్.ఓ. యు. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేటి నుంచే జనగణన స్వీయ నమోదు..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News