Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

ముక్తాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులకు ఘనంగా శ్రీకారం:గ్రామ సర్పంచ్

27-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ద మండల పరిధిలోని ముక్తాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ సుభాష్ చంద్రబోస్ చేతుల మీదుగా ఉపాధి హామీ పథకం పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సీనియర్ మెట్ అశోక్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మట్టి పూడిక పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనుల ద్వారా గ్రామంలోని అవసరమైన మౌలిక వసతులు మెరుగుపడతాయని తెలిపారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో నాగల్గిద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాణిక్ రావు పాటిల్, గ్రామ వార్డు సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన జరుగుతుందని, పేద మరియు కూలీ కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.గ్రామాభివృద్ధికి ఇటువంటి పనులు ఎంతో దోహదపడతాయని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ నాయకులు గ్రామస్తులకు పిలుపునిచ్చారు. కార్యక్రమం గ్రామస్తుల సహకారంతో సజావుగా సాగింది.

Sthanikam

ముక్తాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులకు ఘనంగా శ్రీకారం:గ్రామ సర్పంచ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News