Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:28 PM

మండుతున్న ఎండల్లో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన పల్లపు బుద్ధుడు

27-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా ఉరుమడ్ల గ్రామంలో మండుతున్న వేసవి తీవ్రత మధ్య ఉపాధి హామీ కూలీలకు చల్లని ఉపశమనం లభించింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో, గ్రామ యువజన నాయకుడు జన్నపాల రాము ముందుండి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కూలీలలో ఉత్సాహాన్ని నింపింది. ఎండల దాహాన్ని తీర్చడమే కాకుండా, వారి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిన పల్లపు బుద్ధుడు మరియు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, జన్నపాల రేణుక, రాచమళ్ళ సంధ్య, గురిజ మమత, రూపని వనజ, ఉయ్యాల లక్ష్మయ్యతో పాటు పలువురు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Sthanikam

మండుతున్న ఎండల్లో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన పల్లపు బుద్ధుడు

Article Image

నల్లగొండ జిల్లా ఉరుమడ్ల గ్రామంలో మండుతున్న వేసవి తీవ్రత మధ్య ఉపాధి హామీ కూలీలకు చల్లని ఉపశమనం లభించింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో, గ్రామ యువజన నాయకుడు జన్నపాల రాము ముందుండి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కూలీలలో ఉత్సాహాన్ని నింపింది. ఎండల దాహాన్ని తీర్చడమే కాకుండా, వారి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిన పల్లపు బుద్ధుడు మరియు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ ఝాన్సీ, జన్నపాల రేణుక, రాచమళ్ళ సంధ్య, గురిజ మమత, రూపని వనజ, ఉయ్యాల లక్ష్మయ్యతో పాటు పలువురు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News