Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:46 AM

మందు పిచికారీతో మాడిపోయిన వరి పొలం

మందు పిచికారీతో మాడిపోయిన వరి పొలం

మందు పిచికారీతో మాడిపోయిన వరి పొలం
09-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి, : మండలంలోని మల్లాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని హట్యతండాలో ఓ రైతు సాగు చేసిన వరి పంట మందు పిచికారీ కారణంగా మాడిపోయింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బాదావత్ వీరన్న తన స్వంత 2.20 ఎకరాల పొలంలో వరి సాగు చేశారు. శనివారం ఓ కంపెనీకి చెందిన మందును పిచికారీ చేయగా, ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి చూసేసరికి వరి మొత్తం ఎర్రబడుతూ మాడిపోయినట్లు కనిపించింది.

దీంతో రైతు తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం రైతు బాదావత్ వీరన్నతో కలిసి మల్లాయిగూడెం సర్పంచ్ బాదావత్ నరేష్, హట్యతండా రైతులు బాదావత్ కృష్ణ, రాంబాబు, సాయి అనిల్, బాలాజీ తదితరులు వరి పొలాన్ని పరిశీలించారు.

పంట పూర్తిగా దెబ్బతినడంతో తాను తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు బాదావత్ వీరన్న కోరారు.

Sthanikam

మందు పిచికారీతో మాడిపోయిన వరి పొలం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News