Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

మందనపల్లిలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు పాలాభిషేకం

26-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆలేరు:మందనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు పాలాభిషేకం నిర్వహించారు.గంధమల్ల రిజర్వాయర్ నుండి బిక్కేరు వాగులోకి విడుదలైన సాగునీరు మందనపల్లి శివారుకు చేరుకున్న సందర్భంగా,నల్ల పోచమ్మ ఆలయం వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన,అనంతరం ఎమ్మెల్యే అయిలన్నకు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయిలన్న మాట్లాడుతూ...ఆలేరు అభివృద్ధి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని,సాగునీటితో ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం ద్వారా రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడడమే తన ధ్యేయమని పేర్కొన్నారు.గత రెండు సంవత్సరాలుగా రైతుల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకుని,బిక్కేరు వాగు,అశ్వరావుపల్లి రిజర్వాయర్,దేవాదుల ప్రాజెక్ట్ కాలువల ద్వారా సాగునీటి సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు.అయిలన్న చేసిన అభివృద్ధి పనులకు పార్టీలకతీతంగా ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని,భవిష్యత్తులో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని మందనపల్లి గ్రామ ప్రజల తరఫున కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిరిమర్తి రేణుక నరసయ్య,గ్రామ శాఖ అధ్యక్షుడు నోముల వెంకటేష్,పాల సెంటర్ చైర్మన్ కడకంచి స్వాములు,వార్డు సభ్యులు కడకంచి శ్రీలత,కడకంచి రాజు,ఊట్కూరి అంజయ్య,కుర్రి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మందనపల్లిలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు పాలాభిషేకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News