Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:33 AM

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోరాట దినంగా జరపాలి – పి.ఓ.డబ్ల్యూ కార్యదర్శి గోకినపల్లి సరోజిని

05-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళల ఉపాధిని దెబ్బతీసే వి.బి.జి రాంజీ పథకాన్ని వ్యతిరేకించండి

పిండిప్రోలు: నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మరింతగా పెరిగాయని ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యూ) పాలేరు డివిజన్ ప్రధాన కార్యదర్శి గోకినపల్లి సరోజిని అన్నారు.

పిండిప్రోలు గ్రామంలోని రాయల వెంకట్ నారాయణ భవన్‌లో డివిజన్ అధ్యక్షురాలు శీలం పూలక్క అధ్యక్షతన నిర్వహించిన మహిళల ముఖ్య జనరల్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించిందని విమర్శించారు. పారిశ్రామిక, అసంఘటిత, సంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, వేతనాల్లో వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు.

మహిళలపై అసమానత్వం, అణచివేత, వివక్ష, పురుషాధిపత్యం వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళల హక్కుల సాధన కోసం ముందుకు సాగడమే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క అసలు ఉద్దేశమని చెప్పారు.

1908 మార్చి 8న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళా కార్మికులు పనిగంటల తగ్గింపు, వేతనాల పెంపు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించుకున్న చరిత్ర ఉందన్నారు. అందుకే మార్చి 8ను పండుగలా కాకుండా మహిళల హక్కుల కోసం పోరాట దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బందెల లలిత, కుంబజడ భారతమ్మ, కే సత్యవతి, అయితేనా బోయిన సునీత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోరాట దినంగా జరపాలి – పి.ఓ.డబ్ల్యూ కార్యదర్శి గోకినపల్లి సరోజిని

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News