Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:52 PM

మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం – వివాహ వార్షికోత్సవాన్ని సేవతో జరుపుకున్న దంపతులు

07-04-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణం: ప్రముఖ వైద్యుడు డా. మిట్టపల్లి జనార్ధన్, సువర్ణ దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. మంగళవారం వాసవి క్లబ్ కెసీజీఎఫ్ నల్గొండ, వాసవి క్లబ్ స్ఫూర్తి ఆధ్వర్యంలో స్థానిక సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని మానసిక వికలాంగ విద్యార్థులకు అన్నదానం నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి ఆనందంగా గడిపిన ఈ కార్యక్రమం హృద్యంగా సాగింది.

ఈ సందర్భంగా డా. జనార్ధన్ మాట్లాడుతూ, తమ వివాహ వార్షికోత్సవాన్ని విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సేవ చేయడంలోనే నిజమైన సంతోషం ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, సిబ్బంది వరలక్ష్మి, సల్మా, రాజు, రాజేంద్రప్రసాద్, వాసవి క్లబ్ సభ్యులు మిట్టపల్లి వాత్సవ్, సంతోషిని, మురారి శెట్టి శంకర్, నందిని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం – వివాహ వార్షికోత్సవాన్ని సేవతో జరుపుకున్న దంపతులు

Article Image

నల్గొండ పట్టణం: ప్రముఖ వైద్యుడు డా. మిట్టపల్లి జనార్ధన్, సువర్ణ దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. మంగళవారం వాసవి క్లబ్ కెసీజీఎఫ్ నల్గొండ, వాసవి క్లబ్ స్ఫూర్తి ఆధ్వర్యంలో స్థానిక సూర్యకిరణ్ మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని మానసిక వికలాంగ విద్యార్థులకు అన్నదానం నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి ఆనందంగా గడిపిన ఈ కార్యక్రమం హృద్యంగా సాగింది.

ఈ సందర్భంగా డా. జనార్ధన్ మాట్లాడుతూ, తమ వివాహ వార్షికోత్సవాన్ని విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సేవ చేయడంలోనే నిజమైన సంతోషం ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, సిబ్బంది వరలక్ష్మి, సల్మా, రాజు, రాజేంద్రప్రసాద్, వాసవి క్లబ్ సభ్యులు మిట్టపల్లి వాత్సవ్, సంతోషిని, మురారి శెట్టి శంకర్, నందిని తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News