Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు

14-03-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు* మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సిద్ధమైంది. పరీక్షల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరీక్షల పవిత్రతను కాపాడేందుకు కమిషనరేట్ పరిధిలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 (గతంలో 144 సెక్షన్) కింద నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని కఠినంగా నిషేధించారు. ఈ ఆంక్షలు మార్చి 14వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. అయితే విధుల్లో ఉన్న పోలీసులు, మిలిటరీ సిబ్బంది, హోమ్ గార్డులు, విద్యాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు మరియు అంత్యక్రియల ఊరేగింపులకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుంది.

పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉంచాలని సూచించారు.

నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Sthanikam

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News