Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:50 AM

మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి ఘన సన్మానం ర్యాలీతో స్వాగతం.. చర్చి సంఘస్తుల అభినందనలు

09-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి: పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కండల ఉపేందర్ రెడ్డి కు కూసుమంచి మండల కేంద్రంలో ఆదివారం ఘన సన్మానం నిర్వహించారు. మండలంలోని సి.ఎస్‌.ఐ ఇమ్మానుయేల్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో చర్చి సంఘస్తులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పూలు చల్లుతూ ర్యాలీగా చర్చిలోకి తీసుకువెళ్లి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చర్చి అభివృద్ధికి అందించిన సహాయాన్ని గుర్తు చేశారు. చర్చి ఎక్స్టెన్షన్ బలిపీఠ నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళంగా అందించడంతో బలిపీఠ నిర్మాణం, టైల్స్ వేయడం, చర్చి పరిసరాలను అభివృద్ధి చేయడం సాధ్యమైందని తెలిపారు. అలాగే కూసుమంచి పాస్ట్రేట్ పరిధిలోని పాత కూసుమంచి చర్చి ప్రహారీ గోడ నిర్మాణానికి రూ.90 వేలు, ఇమ్మానుయేల్ చర్చికి రూ.3 లక్షలు, గట్టు సింగారం చర్చికి రేకుల నిర్మాణానికి రూ.60 వేలు, ఉర్లుగొండ చర్చి ప్రహరీ నిర్మాణానికి రూ.30 వేలు, నాయకన్ గూడెం చర్చికి విద్యుత్ ఉపకరణాల కోసం రూ.20 వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తం రూ.5 లక్షలతో ఐదు చర్చిల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు తమవంతు సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే తనకు బాధ కలుగుతుందని, ఎవరికైనా సమస్య ఉంటే తన వద్దకు వచ్చినపుడు సాధ్యమైనంతవరకు సహాయం అందిస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా పాలేరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోదాడ గ్రూప్ చైర్మన్ రెవరెండ్ రమేష్, కూసుమంచి పాస్ట్రేట్ చైర్మన్ శ్రీనివాస్, భారత్ రాష్ట్ర సమితి మండల కమిటీ నాయకులు వేముల వీరయ్య, ఎండి ఆసీపాషా, ఇతర నాయకులు, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి ఘన సన్మానం ర్యాలీతో స్వాగతం.. చర్చి సంఘస్తుల అభినందనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News