Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:38 AM

మహిళలకు చట్ట అవగాహన – సమాజ మార్పుకు తొలి అడుగు

24-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

శ్రీ సత్యసాయి జిల్లా, సోమందేపల్లి: సోమందేపల్లి మండలంలోని ఎన్‌డీఆర్ కియా అనుబంధ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళలకు సోమందేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్లెక్సీలు, ఫ్లకార్డుల ద్వారా మహిళలకు వివిధ చట్టాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మూలాధారం అని, వారి మాటలను కుటుంబ సభ్యులు ఎక్కువగా పాటించే అవకాశం ఉన్నందున మహిళలు కుటుంబాన్ని సరైన దిశలో నడిపించే శక్తిగా నిలవాలని సూచించారు.

కార్యక్రమంలో డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ పిల్లలను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచి చదువులు, క్రీడలపై దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక సమ్మతి చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు.

మహిళల భద్రతపై చట్టపరమైన రక్షణ ఉందని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవచ్చని సూచించారు. రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ కుటుంబాలకు మార్గదర్శకత్వం ఇవ్వడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలరని అధికారులు పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకొని నేరాల నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

— జి. సుధాకర్ యాదవ్, ఎస్‌ఐ, సోమందేపల్లి పోలీస్ స్టేషన్

Sthanikam

మహిళలకు చట్ట అవగాహన – సమాజ మార్పుకు తొలి అడుగు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News