Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

మహిళా సంఘాల ముసుగులో కమిషన్ల దందా!

మహిళా సంఘాల ముసుగులో కమిషన్ల దందా!

మహిళా సంఘాల ముసుగులో కమిషన్ల దందా!
27-04-2026 922 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ బంగారుగడ్డలో ఆర్పీ అరాచకం -లోన్‌కు రూ.1000 ‘కట్’ తప్పనిసరి...?

నిరుపేద మహిళలపై అదనపు భారం – భయంతో నోరు విప్పలేని బాధితులు

నిరుపేద మహిళలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన మహిళా సంఘాలు, ఇప్పుడు కొందరి చేతుల్లో ‘కమిషన్ల కేంద్రాలుగా’ మారుతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు అందించాల్సిన బాధ్యతలో ఉన్న రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సభ్యుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటన చౌటుప్పల్ పరిధిలో కలకలం రేపుతోంది. బంగారుగడ్డ ప్రాంతానికి చెందిన మహిళా సంఘాలకు బ్యాంకు లోన్లు ఇప్పించే క్రమంలో ఆర్పీ శోభ బహిరంగంగానే ఒక్కో సభ్యురాలి నుంచి రూ.1000 చొప్పున ‘కమిషన్’ వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. లోన్ ప్రాసెస్ చేయాలన్నా, సంతకాలు పెట్టాలన్నా డబ్బులు తప్పనిసరి చేస్తున్నారని వారు వాపోతున్నారు.ఇప్పటికే అప్పుల భారంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న తమపై ఈ అదనపు భారం మోపడం అన్యాయమని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో లోన్లు రాకుండా చేస్తారనే భయంతో చాలామంది మౌనం వహిస్తున్నారు.మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను కొందరు స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మహిళా సంఘాల్లో జరుగుతున్న ఈ ‘కమిషన్ల’ దందాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

మహిళా సంఘాల ముసుగులో కమిషన్ల దందా!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News