Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

మహిళా పోలీస్ స్టేషన్‌లో అవినీతి బహిర్గతం ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐపై ఏసీబీ కేసు నమోదు

21-04-2026 252 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వికారాబాద్: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో అవినీతి వెలుగుచూసింది. లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఇన్‌స్పెక్టర్ సరోజా, ఎస్‌ఐ హెచ్. రాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం… ఒక కేసులో నోటీసులు జారీ చేయడానికి మొదట రూ.60 వేల లంచం కోరిన అధికారులు, ఫిర్యాదుదారుడి విజ్ఞప్తి మేరకు దాన్ని రూ.40 వేలకు తగ్గించారు. ఈ క్రమంలో మార్చి 23న ఫిర్యాదుదారు రూ.20 వేలు ఎస్‌ఐకు, ఇన్‌స్పెక్టర్ సమక్షంలో అందజేశాడు.

మిగిలిన మొత్తం ఇవ్వలేకపోయిన ఫిర్యాదుదారు ఏసీబీని ఆశ్రయించడంతో, అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

లంచం అడిగితే 1064కు కాల్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోరితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ సూచించింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.

Sthanikam

మహిళా పోలీస్ స్టేషన్‌లో అవినీతి బహిర్గతం ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐపై ఏసీబీ కేసు నమోదు

Article Image

వికారాబాద్: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో అవినీతి వెలుగుచూసింది. లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఇన్‌స్పెక్టర్ సరోజా, ఎస్‌ఐ హెచ్. రాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం… ఒక కేసులో నోటీసులు జారీ చేయడానికి మొదట రూ.60 వేల లంచం కోరిన అధికారులు, ఫిర్యాదుదారుడి విజ్ఞప్తి మేరకు దాన్ని రూ.40 వేలకు తగ్గించారు. ఈ క్రమంలో మార్చి 23న ఫిర్యాదుదారు రూ.20 వేలు ఎస్‌ఐకు, ఇన్‌స్పెక్టర్ సమక్షంలో అందజేశాడు.

మిగిలిన మొత్తం ఇవ్వలేకపోయిన ఫిర్యాదుదారు ఏసీబీని ఆశ్రయించడంతో, అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

లంచం అడిగితే 1064కు కాల్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు లంచం కోరితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ సూచించింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News