Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:39 AM

మహిళా కూలీల రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలి – రాచకొండ రాములమ్మ

11-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పర్వతగిరి మండలం దేవుని అన్నారంలో ఈనెల 13, 14 తేదీలలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా కూలీల రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని మహిళా కూలీల జిల్లా కన్వీనర్ రాచకొండ రాములమ్మ పిలుపునిచ్చారు.

ఒక ప్రకటనలో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వ్యవసాయ మహిళా కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో 80 శాతం కంటే ఎక్కువగా మహిళలే పనిచేస్తున్నప్పటికీ, కొత్త నిబంధనలతో వారికి ఉపాధి దొరకడం కష్టమైందన్నారు.

ఈ-కేవైసీ, రోజుకు రెండు సార్లు ఫోటోలు వంటి నిబంధనల కారణంగా మహిళా కూలీలు రెండు, మూడు కిలోమీటర్లు నడిచి పనికి వెళ్లినా, సాంకేతిక సమస్యలతో తిరిగి ఇంటికి రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ రోజు కూలి కూడా కోల్పోతున్నారని పేర్కొన్నారు.

పని ప్రదేశాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పలువురు మహిళలు వడదెబ్బలకు గురవుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు భూమిలేని పేద మహిళలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. ఉపాధి హామీ జాబ్ కార్డుల కోసం దరఖాస్తు చేసినా రెండేళ్లుగా ఇవ్వడం లేదన్నారు.

రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో మహిళా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళా కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Sthanikam

మహిళా కూలీల రాష్ట్ర క్లాసులను జయప్రదం చేయాలి – రాచకొండ రాములమ్మ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News