Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:53 PM

మహిళా బిల్లు.. అడుగడుగునా వంచనే!

మహిళా బిల్లు.. అడుగడుగునా వంచనే!

మహిళా బిల్లు.. అడుగడుగునా వంచనే!
25-04-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం

* కార్మిక వ్యతిరేక కోడ్‌లను తిప్పికొట్టాలి

​* సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం

​ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో చిత్తశుద్ధి లేదని, డీలిమిటేషన్ పేరుతో మహిళలను, దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం వంచిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం విమర్శించారు. శనివారం అమరజీవుల రంగారెడ్డి స్మారక భవనంలో జరిగిన "మహిళా రిజర్వేషన్ - డీలిమిటేషన్ బిల్లు, వంచనలు - వాస్తవాలు" సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం వల్ల అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గి తీవ్ర అన్యాయం జరుగుతుందని మల్లేశం ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా బిల్లును తక్షణమే అమలు చేయకుండా, జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన వంటి కొర్రీలు పెట్టడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు.​కార్మిక, రైతు వ్యతిరేక పాలన గడిచిన 12 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ సంపదను తాకట్టు పెడుతోందని ఆయన ధ్వజమెత్తారు.రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా నల్ల చట్టాలను తెచ్చారని విమర్శించారు.ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.

రాబోయే మే డే వేడుకలను కార్మికులంతా ఐక్యంగా జరుపుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, రాగిరి కిష్టయ్య, నాయకులు ఆదిమూలం నందీశ్వర్, బొడ్డు అంజిరెడ్డి, సప్పిడి శ్రీనివాసరెడ్డి, తూర్పునూరు మల్లేశం, బోయ యాదయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా బిల్లు.. అడుగడుగునా వంచనే!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News