Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

మహిళ భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం

22-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ పెనుకొండ సబ్‌డివిజన్ పరిధిలోని కియా పోలీస్ స్టేషన్‌ను ఈరోజు వార్షిక తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని లాకప్ గది, కంప్యూటర్ విభాగం మరియు పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, లాంగ్ పెండింగ్ కేసులపై సమగ్ర సమీక్ష చేపట్టారు. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించి, తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పోలీసులు నిర్వహించే రికార్డులను పూర్తిగా పరిశీలించిన ఎస్పీ గారు, హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల పరిస్థితులను తెలుసుకొని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అక్రమ మద్యం, ఇసుక రవాణా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాల్య వివాహాలు, సైబర్ మోసాలు, పోక్సో కేసులు మరియు నూతన చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి, విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, హైవే పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని సూచించారు. చోరీలను అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అవినీతికి తావులేకుండా నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలని, సిబ్బంది సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ నరసింగప్ప, సీసీ చిరంజీవి, ఎస్సైలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, పుట్టపర్తి

Sthanikam

మహిళ భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News