Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా సతీష్‌కుమార్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 09:03 AM

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

11-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట పట్టణంలోని రాఘవ ప్లాజా సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద శనివారం 199వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిదుర్గం చైర్మన్, సూర్యాపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ డాక్టర్ వూరా రామమూర్తి యాదవ్, డాక్టర్ సల్వాది రమేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర దళిత రత్న అవార్డు గ్రహీత డాక్టర్ భాషపంగు భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన మహిళలు అభివృద్ధి చెందకపోతే దేశ పురోగతి సాధ్యం కాదని మహాత్మ జ్యోతిరావు పూలే విశ్వసించారని తెలిపారు. మహిళా విద్యకు తొలి ప్రాధాన్యతనిస్తూ తన సతీమణి సావిత్రిబాయి పూలేను విద్యాభ్యాసానికి ప్రోత్సహించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పించడం, వితంతువుల పునర్వివాహానికి మద్దతు ఇవ్వడం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం వంటి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది నాతి సవిందర్, ఎర్రమళ్ళ రాములు, ముద్దా బిక్షపతి యాదవ్, యాతాకుల సునీల్, భూక్యా రాజు నాయక్, నవీలే ఉపేందర్, పిడమర్తి లింగయ్య, వావిళ్ల రమేష్ గౌడ్, బాలు నాయక్, పోలోజు మహేష్ చారి, పోతుగంటి వీరచారి, భాషపంగు సమరం, బడుగుల నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News