Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:21 AM

"మహనీయుల స్పూర్తితో ఐక్యతను చాటుదాం"

"మహనీయుల స్పూర్తితో ఐక్యతను చాటుదాం"

"మహనీయుల స్పూర్తితో ఐక్యతను చాటుదాం"
14-04-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

"జిల్లా కేంద్రంలో ఘనంగా భీమ్ యాత్ర"- భీమ్ యాత్రలో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు

మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే,బాబాసాహెబ్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ ల స్పూర్తితో అణగారిన వర్గాల ఐక్యతను చాటుదామని మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ యాత్ర ప్రారంభం సందర్భంగా వారు మాట్లాడుతూ... సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటిత పరచి విద్యా ఆవశ్యకతను తెలిపిన మహనీయుడు జ్యోతిరావు పూలే అయితే ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి మనుషులందరూ సమానమే అని సమాన హక్కులు కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాగే హక్కులు అనేవి అడుక్కుంటే రావని పోరాడి సాధించుకోవాలని చెప్పిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. వారు సూచించిన మార్గాలను, ఆశయాలను స్పూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాలని అన్నారు. భారత రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల ప్రజలు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భీమ్ యాత్ర హైదరాబాద్ చౌరాస్తా నుండి ప్రారంభమై నల్గొండ చౌరస్తా, జంఖాన్ గూడా,బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా, పాత బస్టాండ్ నుండి తిరిగి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. యాత్ర లో పాల్గొన్న... బట్టు రాంచంద్రయ్య,నాగరం అంజయ్య,బర్రె జహంగీర్,దొనకొండ రాములు సురుపంగా శివలింగం,ఎండి.ఇలియస్, కర్తల శ్రీనివాస్,ఇటుకల దేవేందర్, కుతడి సురేష్,నాగరం శంకర్,కనుకుంట్ల రమేష్ కోటి,చింతల శివ ,వనం రాజు,కారుపటి రాజు,బర్రె నరేష్, కౌన్సిలర్స్,బొంతల నర్సింగ్ రావు, జాలిగం విగ్నేష్,బర్రె పూజిత,బట్టుపల్లి అనురాధ,బర్రె ప్రమీల,గాయపక శ్రవణ్,జాలిగం శివ,కాశపక మహేష్,ఆనంపట్ల కృష్ణ,దుబ్బ రామకృష్ణ మాదిగ సురేష్,వడ్డేపల్లి దాస్,హాస్టల్ విద్యార్థులు, జైభీం ఆటో యూనియన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

"మహనీయుల స్పూర్తితో ఐక్యతను చాటుదాం"

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News