Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:53 AM

మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: కలెక్టర్

09-03-2026 219 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, మార్చి 9: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై ప్రత్యేక అధికారులు పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 691 ప్రభుత్వ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక అధికారులు ప్రతిరోజూ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూడాలని సూచించారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ ప్రకారం వంట జరుగుతోందో లేదో పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని అన్నారు.

మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు ఉన్నా వెంటనే గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని సూచించారు.

ప్రభుత్వ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో వంట సరుకులు, కూరగాయలు నాణ్యంగా ఉండేలా చూసుకోవడంతో పాటు వంటగదులు పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీరు సక్రమంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలయ్యేలా ప్రత్యేక అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

Sthanikam

మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News