Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:40 AM

లోతుకుంట కేజీబీవీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన సదస్సు

14-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ మండల పరిధిలోని లోతుకుంట గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని రామన్నపేట మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డి. సత్తయ్య ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సమానత్వం మరియు న్యాయం సాధనపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకొని తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.

ప్యానెల్ అడ్వకేట్ బి. డేవిడ్ మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, మహిళల హక్కులు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులు చట్టాలపై స్పష్టమైన అవగాహన పొందడంతో పాటు బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది జ్యోతి, మాధవి, అనుష, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లోతుకుంట కేజీబీవీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News