Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:22 AM

లింగపాలెంలో ఘరానా మోసం – డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి!

19-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం:

మండలంలోని తోచిలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటేశ్వరరావు (రాజు) కుటుంబానికి భారీ మోసం జరిగిందని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆయన సోదరి, చింతలపూడి గ్రామానికి చెందిన పెద్దపులి లక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం… లింగపాలెం గ్రామంలో ఉన్న “శ్రీ సాయిరాం ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్” ప్రొప్రైటర్ బేతిన నాగ వెంకట మధుకు తమ కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపార అభివృద్ధి కోసం లక్షల రూపాయలు డిపాజిట్‌గా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఇటీవల కుటుంబ ఆర్థిక అవసరాల నేపథ్యంలో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు అడిగినా, ఎలాంటి స్పందన రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా డబ్బులు అడిగినందుకు దుర్భాషలాడటమే కాకుండా, మహిళలను కూడా చూడకుండా అవమానకరంగా ప్రవర్తించి, శారీరకంగా దాడి చేసినట్లు ఆరోపించారు.

“నీకు దిక్కున కాడ చెప్పుకో” అంటూ బెదిరిస్తూ బయటకు నెట్టివేసి, తమపై దాడి చేశారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై లింగపాలెం మండల కాపు సంఘం పెద్దలను ఆశ్రయించినట్లు చెప్పారు.

ఈ విషయంపై కాపు సంఘం నాయకులు తీవ్రంగా స్పందించారు.

“కష్టపడి సంపాదించిన డబ్బులు డిపాజిట్‌గా ఇచ్చిన బాధితులు తిరిగి అడిగితే, మహిళలపై దాడి చేయడం దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే సరైన చర్యలు తీసుకోకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోరాటం చేస్తాం” అని హెచ్చరించారు.

Sthanikam

లింగపాలెంలో ఘరానా మోసం – డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News