Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:39 AM

లింగ నిర్ధారణ నిషేధంపై కఠిన చర్యలు: PC&PNDT సమీక్ష సమావేశం

08-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రీ–కన్సెప్షన్ & ప్రీ–నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం–1994 (PC&PNDT Act) అమలుపై జిల్లా స్థాయి సలహా కమిటీ (DLAC) సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. ఎం. మనోహర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ మినీ హాల్, రాయగిరిలో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లాలో చట్టపరమైన నిబంధనల అమలు, ఆరోగ్య సంస్థల పనితీరు, రికార్డుల నిర్వహణ, సేవల నాణ్యతపై విస్తృతంగా చర్చించి సమీక్షించారు. అల్ట్రాసౌండ్ కేంద్రాలు, జన్యు పరీక్ష కేంద్రాల నమోదు, పునరుద్ధరణ, వార్షిక తనిఖీలు, చట్ట ఉల్లంఘనలపై తీసుకున్న చర్యలు, పెండింగ్ అంశాలపై సమగ్రంగా పరిశీలించారు.

అన్ని నమోదిత కేంద్రాలు చట్ట నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా లింగ నిర్ధారణ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని, ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో PC&PNDT ప్రోగ్రాం అధికారి డా. యల్. యశోద, డా. ఇందిరామణి (గైనకాలజీ విభాగాధిపతి), డా. జ్యోతి, డా. శ్రీదేవి, డా. నిర్మల (పిల్లల వైద్య నిపుణులు), డా. సుమన్ కళ్యాణ్ (డిప్యూటీ DM&HO), జిల్లా పబ్లిక్ రిలేషన్స్ అధికారి అరుంధతి, డా. ప్రమీల (సఖి NGO), శివలింగం (యాత్ర NGO), నాగరాజు (స్కీడ్ NGO), చి. సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లింగ నిర్ధారణ నిషేధంపై కఠిన చర్యలు: PC&PNDT సమీక్ష సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News