Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

లయన్స్ కంటి ఆసుపత్రి ఏర్పాటుకు ముందడుగు – జిల్లా పాలనకు వినతి

10-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కొండ ప్రాంతంలో లయన్స్ కంటి ఆసుపత్రి ఏర్పాటు చేయుటకు నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపును కోరుతూ జిల్లా పాలనకు వినతిపత్రం సమర్పించబడింది.ఈ వినతిపత్రాన్ని చార్టర్ అధ్యక్షుడు, నారాయణఖేడ్ శాసనసభ్యుడు లయన్ డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్యకు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బావుగి సాయి సంగమేశ్వర్, జోన్ అధ్యక్షుడు బి. రాజ్ కుమార్, సీనియర్ లయన్స్ సభ్యుడు దిగంబర రావు, మాజీ అధ్యక్షుడు డి. వెంకట్రావు కలిసి అందజేశారు.నారాయణఖేడ్ మరియు పరిసర గ్రామాల ప్రజలు ప్రస్తుతం కంటి వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొని ఉందని, దీనివల్ల పేద మరియు మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లయన్స్ క్లబ్ ప్రతినిధులు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని స్థానికంగానే నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు లయన్స్ కంటి ఆసుపత్రి ఏర్పాటు ఎంతో అవసరమని వివరించారు.ప్రతిపాదిత లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా ఉచిత కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు, కళ్లద్దాల పంపిణీతో పాటు నిరంతర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో లయన్స్ క్లబ్ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ ఆసుపత్రి ఏర్పాటు వల్ల కొండ ప్రాంత ప్రజలకు, గ్రామీణ ప్రాంత వాసులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.అందువల్ల ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొండ ప్రాంతంలో లయన్స్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని జిల్లా పాలనను లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ విజ్ఞప్తి చేసింది.

Sthanikam

లయన్స్ కంటి ఆసుపత్రి ఏర్పాటుకు ముందడుగు – జిల్లా పాలనకు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News