Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 09:16 AM

లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

29-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండ జిల్లావ్యాప్తంగా 7,624 కేసుల పరిష్కారం..

నల్లగొండ : ప్రజలకు త్వరితగతిన మరియు ఖర్చులేని న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయశాఖ, పోలీస్ శాఖ మరియు ఇతర సంబంధిత విభాగాల సమన్వయంతో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రికార్డు స్థాయిలో కేసులు పరిష్కారమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా మొత్తం 7,624 కేసులు కొలిక్కి వచ్చాయని, ఇందులో 4,182 డీడీ కేసులు, 2,512 ఈ-పెట్టీ కేసులు, 886 ఐపీసీ కేసులు మరియు 44 ఎస్ఎల్ఎల్ కేసులు ఉన్నాయని వివరించారు.

​కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న కేసులను పరస్పర అవగాహనతో చట్టబద్ధంగా పరిష్కరించుకోవడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గడమే కాకుండా కక్షిదారుల సమయం మరియు ధనం ఆదా అవుతాయని ఎస్పీ అభిప్రాయపడ్డారు. జాతీయ లోక్ అదాలత్ వంటి కార్యక్రమాలు సామాన్య ప్రజలకు ఎంతో కీలకమని దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందేందుకు ఇదొక చక్కని అవకాశమని ఆయన అన్నారు. భవిష్యత్తులో నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాల్లో కూడా ప్రజలు చురుకుగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ భారీ స్థాయిలో కేసుల పరిష్కారం సాధ్యం కావడానికి కృషి చేసిన జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు ఇతర శాఖల ప్రతినిధులను ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అందరి సమన్వయంతోనే ఇంతటి విశేష ఫలితాలు సాధించగలిగామని ఆయన కొనియాడారు.

Sthanikam

లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News