Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:36 AM

కూతురు తలకొరివి – బోగారం గ్రామంలో కంటతడి

కూతురు తలకొరివి – బోగారం గ్రామంలో కంటతడి

కూతురు తలకొరివి – బోగారం గ్రామంలో కంటతడి
10-04-2026 283 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన దోర్నాల రాములు అకాల మృతిచెందగా, ఆయన అంత్యక్రియలు హృదయ విదారక వాతావరణంలో జరిగాయి.

రాములకు నలుగురు కూతుళ్లు ఉండగా, పెద్ద కూతురు రమాదేవి సంప్రదాయాలను అధిగమిస్తూ తండ్రికి తలకొరివి పెట్టి అందరినీ కంటతడి పెట్టించింది. ఆమెతో పాటు రెండవ కూతురు రజిని, మూడవ కూతురు విజయ, నాలుగవ కూతురు కల్పన తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయారు.

కూతురు తలకొరివి పెట్టిన ఈ ఘటన గ్రామంలో భావోద్వేగాన్ని రేకెత్తించింది. “కంటే కూతుర్నే కనాలి” అనే మాటను గుర్తు చేస్తూ పలువురిని ఆలోచింపజేసింది.

ఈ దహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

Sthanikam

కూతురు తలకొరివి – బోగారం గ్రామంలో కంటతడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News