Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:38 AM

కురువ–కురుమల అభ్యున్నతికి కృషి చేస్తాం – దేవేంద్రప్ప

14-04-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కురుబ సంఘం నూతనంగా ఎన్నికైన నాయకుల సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కురుమ, కురుబ, కురువల అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని తెలిపారు. ఆర్థిక, విద్యా, రాజకీయ రంగాల్లో కురుబలు ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో రాణించగలరని పేర్కొన్నారు. కుల సంఘాలు ఐక్యంగా ఉంటూ ముందుకు సాగితే రాజకీయంగా ఎదగడం సులభమవుతుందని అన్నారు.

కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మదనపల్లెలో తన గెలుపుకు సహకరించిన కురుబలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కురుబలకు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

దేవేంద్రప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కురుబలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. కురుబలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో కురుబలు ఐక్యంగా కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే నారా లోకేష్ తమకు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు గౌని లక్ష్మన్న, కాంతారావు, రఘునాథ్, కప్పల శ్రీరాములు, సదాశివ, గూడే శ్రీనివాసులు, ఆవుల కిష్టయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కురువ–కురుమల అభ్యున్నతికి కృషి చేస్తాం – దేవేంద్రప్ప

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News