Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:12 AM

కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి: తల్లమల్ల హసేన్

27-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఫిబ్రవరి 18న జరిగిన మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది తల్లమల్ల హసేన్ డిమాండ్ చేశారు. దేవాలయ దర్శనానికి వెళ్లిన కుటుంబంపై కులం పేరుతో దూషిస్తూ దాడి చేసి రెండు నెలల పసిబిడ్డ మృతి చెందిన ఘటన తీవ్రంగా ఖండనీయమన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటనపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు, కెవిపిఎస్ మరియు ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లమల్ల హసేన్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, తెలంగాణ మాదిగ జన సమితి అధ్యక్షుడు ఊట్కూరు సైదులు మాట్లాడుతూ ఘటనను తీవ్రంగా ఖండించారు. పసిబిడ్డ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బోల్లెద్దు వినయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల నరసయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నామా వేణు, రాష్ట్ర కార్యదర్శి కాశిమల్ల వెంకట నరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, ఉపాధ్యక్షుడు పులుసు సత్యం, సిఐటియు నాయకుడు మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి: తల్లమల్ల హసేన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News