Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

కుమ్మరుల సర్వసభ్య సమావేశం మోటకొండూరులో కమిటీలు ఏకగ్రీవం

27-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మోటకొండూరు మండలం 20 గ్రామాల సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్ర కుమ్మర సంఘం నాయకత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మండల అధ్యక్షుడిగా కోరుటూరు మధు, ప్రధాన కార్యదర్శిగా పచ్చాపురం ఉప్పలయ్య, ఖజాంచీగా శనిగారం పరశురామ్, గౌరవాధ్యక్షుడిగా జివిలీకపల్లి నరసింహ, ఉపాధ్యక్షులుగా కానుగుల వెంకటేష్, శనిగారం పుల్లయ్య, యువత విభాగం అధ్యక్షుడిగా శనిగారం ప్రదీప్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ… త్వరలో జిల్లాలో కుమ్మరుల మహా బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కుమ్మరుల అభివృద్ధే లక్ష్యమని పేర్కొంటూ పలు డిమాండ్లు వెల్లడించారు.

కుమ్మరులను బీసీ-బీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, గ్రామ దేవతల ఆలయాల్లో పూజారులుగా పనిచేస్తున్న వారికి నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృత్తి పనిముట్లు అందజేయాలని, 55 సంవత్సరాలు పైబడిన వారికి రూ.6 వేల పెన్షన్ కల్పించాలని కోరారు. చిన్న పరిశ్రమల ఏర్పాటు కోసం మూడు ఎకరాల భూమితో పాటు రూ.2 లక్షల రుణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాబోయే మహాసభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, వృత్తిదారుల ప్రతినిధులు, మండలంలోని 20 గ్రామాల ప్రతినిధులు, కుమ్మరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కుమ్మరుల సర్వసభ్య సమావేశం మోటకొండూరులో కమిటీలు ఏకగ్రీవం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News