Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:52 AM

కూలి కార్మికుడు ఉప్పయ్య మృతి.. కుటుంబానికి సాయం చేయాలని విజ్ఞప్తి

09-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలం చేగోమ్మ గ్రామ దళిత కాలనీకి చెందిన కిన్నెర ఉప్పయ్య (55) అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం గత ఆరు నెలలుగా సుగర్, బీపీ సమస్యలతో పాటు రెండు కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఉప్పయ్య కూలి పనులపై ఆధారపడి కుటుంబాన్ని పోషించేవారని గ్రామస్తులు తెలిపారు. ఆయనకు భార్యతో పాటు ముగ్గురు సంతానం ఉన్నారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారిలో చిన్న కుమార్తె అనారోగ్యంతో బాధపడుతోందని తెలిపారు. కుటుంబం పూర్తిగా కూలి పనులపై ఆధారపడుతూ ఉండటంతో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో ఉప్పయ్య కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు, నాయకులు కోరారు. సోమవారం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో Communist Party of India (Marxist) కూసుమంచి మండల కార్యదర్శి వర్గ సభ్యుడు తాళ్లూరి వెంకటేశ్వరరావు, చేగోమ్మ గ్రామ శాఖ కార్యదర్శి ఉన్నం బాబు, సభ్యులు నర్రా వెంకన్న, CPI (ML) New Democracy నాయకుడు మాతంగి రామస్వామి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కూలి కార్మికుడు ఉప్పయ్య మృతి.. కుటుంబానికి సాయం చేయాలని విజ్ఞప్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News