Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి: కొండమడుగు నరసింహ

25-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్,

నిప్పులు చెరిగే ఎండలో పనిచేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి Kondamadugu Narsimha విమర్శించారు.

శనివారం బీబీనగర్ ఎంపీడీవో కార్యాలయం ముందు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ప్రదేశాల్లో ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా రోజుకు రెండుసార్లు ముఖాధారిత హాజరు నమోదు చేయడం వల్ల సాంకేతిక సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం Mahatma Gandhi National Rural Employment Guarantee Act అమలులో మార్పులు చేస్తూ కార్మికుల హక్కులను తగ్గిస్తోందని ఆరోపించారు. చేసిన పనికి వేతనాలు సకాలంలో అందకపోవడం, నెలల తరబడి బకాయిలు పేరుకుపోవడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఎండల్లో పనిచేసే కార్మికులకు తాగునీరు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రోజుకు రూ.800 కూలీ ఇవ్వాలని, పని సమయంలో గాయపడితే వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని కోరారు.

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతన బకాయిలను వెంటనే చెల్లించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

అనంతరం సూపరిండెంట్ రవి శివకుమార్, ఏపీఓ కళావతికి కార్మికులతో కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షురాలు కొలిచెలమ ప్రసన్న, మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, సీఐటీయూ మండల కన్వీనర్ బండారి శ్రావణ్, నాయకులు ఎస్‌.డి. ఉమర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి: కొండమడుగు నరసింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News